మ‌రో 2, 3 రోజుల్లో నైరుతి రుతుప‌వ‌నాల రాక‌.. 2 రోజులు వ‌ర్షాలు

మ‌రో రెండు, మూడు రోజుల్లో తెలంగాణ‌లో ప్ర‌వేశించ‌నున్నాయి నైరుతి రుతుప‌వ‌నాలు.. నిన్న దక్షిణ కేరళలోకి ప్రవేశించిన నైరుతి ఋతుపవనాలు ఈ రోజు కేరళా అంతటా మరియు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్‌లో కొంత భాగంలోకి ప్ర‌వేశించాయి… రాగల 2 నుండి 3 రోజులలో తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ జిల్లాలలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.. ఇక‌, దక్షిణ ఛత్తీస్‌గ‌ఢ్ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీట‌ర్ల వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరియు తెలంగాణ నుండి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీట‌ర్ల వరకు వ్యాపించి ఉన్న ద్రోణి.. ఈ రోజు బలహీన ప‌డింది.. ఈ రోజు గాలులు నైరుతి దిశగా తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నాయి.. వీటి ప్ర‌భావంతో.. రాగ‌ల మూడు రోజులు.. తేలికపాటి నుండి మోస్తరు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తోంది వాతావ‌ర‌ణ శాఖ‌.. రాగల 3 రోజులు… ఇవాళ, రేపు, ఎల్లుండి.. ఉరుములు మరియు మెరుపులుతో కూడిన వర్షం తెలంగాణలోని ఒకటి, రెండు ప్ర‌దేశాల్లో కురిసే అవ‌కాశాలున్నాయి.. ఇక‌, రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఒక‌టి రెండు చోట్ల భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-