పిల్ల‌ల్ని వ‌ణికిస్తున్న క‌రోనా… 8,000 మందికి పాజిటివ్ !

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ కరోనా సెకండ్ వేవ్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ఈ వైరస్ పేదవాళ్ళను కూడా వదలడం లేదు. సెకండ్ వేవ్ ముగుస్తున్న తరుణంలో థర్డ్ వేవ్ కూడా ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. థర్డ్ వేవ్ లో భారీగా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అయితే తాజాగా మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో 8 వేల మందికి పైగా చిన్నారులకు కరోనా సోకింది. దీంతో వారికి వైద్యం అందించేందుకు ఆరోగ్యశాఖ అధికారులు సాంగ్లిలో ప్రత్యేకంగా పిల్లల కోసం కరోనా వార్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఐదుగురు పిల్లలు ఈ వార్డులో ట్రీట్మెంట్ పొందుతున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-