నైరుతి రుతుప‌వ‌నాల రాక ఆల‌స్యం

నైరుతి రుతుప‌వ‌నాల రాక కాస్త ఆల‌స్యం అవుతున్న‌ట్టు భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం (ఐఎండీ) వెల్ల‌డించింది.. అయితే, కేర‌ళ‌ను మ‌రికొన్ని గంట‌ల్లో తొల‌క‌రి ప‌లక‌రించ‌నుంది.. ఈ నెల 3న నైరుతి రుతుప‌వ‌నాలు కేర‌ళ‌లో ప్ర‌వేశిస్తాయ‌ని ఐఎండీ అంచ‌నా వేసింది.. కాస్త ఆల‌స్య‌మైతే.. 4వ తేదీన కేర‌ళ‌లో ప్రవేశించే అవకాశం ఉందంటోంది ఐఎండీ.. కాగా, ముందుగా అంచ‌నా వేసిన ప్ర‌కారం… జూన్ 1న అంటే ఈరోజే నైరుతి రుతుప‌వ‌నాలు కేర‌ళ‌లో ప్ర‌వేశించాల్సి ఉంది.. కానీ, మందగ‌మ‌నం కార‌ణంగా రెండు, మూడు రోజులు ఆస‌ల్యం అవుతుంద‌ని ఐఎండీ అంచ‌నా వేస్తోంది.. మ‌రోవైపు.. కేర‌ళ‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.. ఇది నైరుతి రుతుప‌వ‌నాల సీజ‌న్‌.. అయితే, ఇప్ప‌టికీ భార‌త్‌లో నైరుతి రుతుప‌వ‌నాలు ప్ర‌వేశించ‌లేద‌ని చెబుతోంది ఐఎండీ.. ఇక అక్క‌డి నుంచి తెలుగు రాష్ట్రాల‌కు చేరుకోవాలంటే వారం రోజుల స‌మ‌యం ప‌ట్ట‌నుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-