హిమాచ‌ల్‌లో ప్ర‌కృతి విల‌యం…213 మంది మృతి…భారీ న‌ష్టం…

ప్ర‌తి ఏడాది వ‌ర్షాకాలంలో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ప్ర‌కృతి విల‌యాన్ని సృష్టిస్తుంటుంది.  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టం అక్క‌డ కామ‌న్‌.  అయితే, ఈ వ‌ర్షాకాలంలో మ‌రింత విల‌యాన్ని సృష్టించింది.  ఈ విలయం దెబ్బ‌కు 213 మంది మృతి చెందారు.  రూ.600 కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఆస్తి న‌ష్టం సంభ‌వించింది.  భారీ వ‌ర‌ద‌ల‌కు 12 మంది క‌నిపించ‌కుండా పోయిన‌ట్టు స్టేట్ డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్ అథారిటీ పేర్కొన్న‌ది.  ఇప్ప‌టికీ ఇంకా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.  నిన్న కురిసిన భారీ వ‌ర్షాల‌కు ముగ్గురు మృతి చెందిన‌ట్టు అధికారులు ప్ర‌క‌టించారు.  మ‌రికొన్ని రోజులు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్టు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించ‌డంతో అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు.  

Read: “లెఫ్టినెంట్ రామ్” హీరోయిన్ ఫస్ట్ లుక్

Related Articles

Latest Articles

-Advertisement-