18 ఏళ్ల త‌రువాత మ‌రోసారి ఆ వ్యాధి…

ఎప్పుడో సోకిన వ్యాధులు తిరిగి మ‌ళ్లీ విస్త‌రిస్తున్నాయి.  18 ఏళ్ల క్రితం అంటే 2003వ సంవ‌త్స‌రంలో అరుదైన మంకీఫాక్స్ కేసులు అనేకం వ్యాపించాయి.  ఆ త‌రువాత ఆ కేసులు మెల్లిగా క‌నుమ‌రుగ‌య్యాయి.  కాగా, ఇప్పుడు మ‌రోసారి ఈ కేసులు బ‌య‌ట‌ప‌డుతుండ‌టంతో అమెరికా అప్ర‌మ‌త్తం అయింది.  ఇటీవ‌లే టెక్సాస్‌కు చెందిన ఓ వ్య‌క్తి నైజీరియా వెళ్లి వ‌చ్చాడు.  అలా వ‌చ్చిన వ్య‌క్తిలో ఈ మంకీఫాక్స్ ల‌క్ష‌ణాలు క‌నిపించాయి.  వెంట‌నే ఆ వ్య‌క్తిని డాల‌స్‌లోని ఆసుప‌త్రిలో వేరుగా ఉంచి చికిత్స అందిస్తున్నారు.  జులై 8,9 తేదీల్లో నైజీరియా నుంచి రాక‌పోక‌లు సాగించిన వివ‌రాలు, బాధితునితో స‌న్నిహితంగా ఉన్న‌వారి వివ‌రాలు సేక‌రించే ప‌నిలో ఉన్నారు అధికారులు.  ప్ర‌స్తుతం ఒక్క వ్య‌క్తిలో మాత్ర‌మే ఈ వైర‌స్‌ను గుర్తించారు.  

Read: ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : థర్డ్ వేవ్ ముప్పు తప్పదా..?

ఇది ఒక మ‌నిషినుంచి మ‌రోక‌రికి వ్యాపింస్తుంది.  ఈ వైర‌స్ తుంప‌ర్ల ద్వారా ఒక‌రి నుంచి మ‌రోక‌రికి సోకుతుంది.  అరుదైన వ్యాధుల జాబితాలో దీనిని చేర్చిన సంగ‌తి తెలిసిదే, మ‌ధ్య‌, ప‌శ్చిమ మ‌ధ్య ఆఫ్రికాలోని మారుమూల ప్రాంతాల్లో ఈ వైర‌స్ క‌నిపిస్తుంటుంది.  కోతులు, ఎలుక‌ల నుంచి ఈ వైర‌స్ మ‌నుషుల‌కు సోకుతుంది.  ఈ వైర‌స్ సోకిన వ్య‌క్తి శ‌రీరంపై ద‌ద్దుర్లు వ‌స్తాయి.  సాధార‌ణంగా ఈ వ్యాధి 2 నుంచి 4 వారాల్లో తగ్గిపోతుంది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-