కరోనా టాబ్లెట్‌తో ఎముకలు దెబ్బతింటాయి.. ఐసీఎంఆర్ చీఫ్ హెచ్చరిక

కరోనా కేసులు బీభత్సంగా పెరుగుతున్న వేళ ఇటీవల దేశంలో కరోనా టాబ్లెట్ మోల్నుపిరవిర్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ టాబ్లెట్‌తో ముప్పు పొంచి ఉందని భారత వైద్యపరిశోధన మండలి(ఐసీఎంఆర్) చీఫ్ బలరాం భార్గవ హెచ్చరికలు జారీ చేశారు. ఈ కరోనా మాత్ర వాడితే శరీరంలో ఎముకలు, కండరాలు దెబ్బతినే అవకాశముందని ఆయన తెలిపారు. మోల్నుపిరవిర్ 200 ఎంజీ టాబ్లెట్‌తో జన్యువుల్లో శాశ్వతంగా మార్పులు వస్తామని ఆయన పేర్కొన్నారు. అందువల్ల ఈ టాబ్లెట్ మాత్రలను కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ.. కరోనా చికిత్స మార్గదర్శకాల్లో చేర్చలేదని ఐసీఎంఆర్ చీఫ్ వివరించారు.

Read Also: కరోనా థర్డ్ వేవ్.. ఇండియాలో ఒక్కరోజే 90,928 పాజిటివ్ కేసులు

కాగా మోల్నుపిరవిర్ కరోనా టాబ్లెట్‌ను మన దేశంలో 13 ఫార్మా కంపెనీలు తయారుచేస్తున్నాయి. మ్యాన్‌కైండ్ ఫార్మా, సన్ ఫార్మా, డా.రెడ్డీస్, హెటిరో సహా ఇతర సంస్థలు ఈ మాత్రలను తయారు చేసేందుకు అనుమతి పొందాయి. కరోనా సోకిన వారు ఈ మాత్రను ఐదురోజుల కోర్సుగా వాడాలని… ఉదయం నాలుగు, సాయంత్రం నాలుగు టాబ్లెట్ల చొప్పున వేసుకోవాలని కంపెనీలు సూచించాయి. ఒక్కో డబ్బాలో 40 మాత్రలు ఉంటాయని.. ఈ డబ్బా ఖరీదును డా.రెడ్డీస్ రూ.1,400గా ప్రకటించగా… సన్‌ఫార్మా రూ.1500, మ్యాన్ కైండ్ రూ.1,399గా ధరను నిర్ణయించాయి.

Related Articles

Latest Articles