కరోనాకు టాబ్లెట్ వచ్చేసింది… ధర ఎంతో తెలుసా?

దేశంలో మళ్లీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా సోకుతుండటంపై భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో తొలిసారి కరోనాకు టాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. కరోనా మాత్రలను డా.రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సంస్థ మార్కెటింగ్ చేయనుంది. ఈ మేరకు అమెరికన్ ఫార్మా కంపెనీ మెర్క్ అభివృద్ధి చేసిన ‘మోల్నుపిరవిర్’ మాత్రల ధరలను డా.రెడ్డీస్ సంస్థ ప్రకటించింది.


200 మిల్లీగ్రాముల మాత్రను రూ.35 చొప్పున విక్రయించనున్నట్లు డా.రెడ్డీస్ తెలిపింది. కరోనా సోకిన వారు 5 రోజుల పాటు రోజుకు 8 మాత్రల చొప్పున వేసుకోవాల్సి ఉంటుందని వివరించింది. కరోనా టాబ్లెట్ ఐదురోజుల కోర్సు ధర రూ.1,400గా డా.రెడ్డీస్ వెల్లడించింది. ఒక్కో డబ్బాలో 40 మాత్రలు ఉంటాయని… ఉదయం నాలుగు, సాయంత్రం నాలుగు చొప్పున వేసుకోవాలని సూచించింది. ఆక్సిజన్ స్థాయి 93 శాతం కంటే తక్కువగా ఉండడంతోపాటు వైరస్ ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఈ ట్యాబ్లెట్లను ఉపయోగించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది.

Related Articles

Latest Articles