హైదరాబాద్ లో మొదలైన మోహన్ లాల్ కొత్త సినిమా షూటింగ్

‘లూసిఫర్’ మూవీ తర్వాత మోహన్ లాల్ కథానాయకుడిగా యంగ్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ బ్రో డాడీ’. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ షూటింగ్ ఈ రోజు హైదరాబాద్ లో మొదలైంది. నిజానికి 45 రోజుల సింగిల్ షెడ్యూల్ లో ఈ మూవీని కేరళలో ప్లాన్ చేశారు. కానీ అక్కడి ప్రభుత్వం కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా తగ్గకపోవడంతో మూవీ షూటింగ్స్ కు అనుమతి ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో మొత్తం టీమ్ ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఇక్కడే షూటింగ్ మొదలెట్టేసింది.

Read Also : అక్కినేని హీరోను రిజెక్ట్ చేసిన ‘ఉప్పెన’ బ్యూటీ ?

‘లూసిఫర్’ లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత పృథ్వీరాజ్ దానికి సీక్వెల్ కు ప్లాన్ చేశారు. అయితే ఈ లోగా ఈ క్యూట్ ఫ్యామిలీ, కామెడీ ఎంటర్ టైనర్ తో మరోసారి జనం ముందుకు దర్శకుడిగా రావాలని పృథ్వీరాజ్ అనుకున్నారు. శ్రీజిత్, బిబిన్ కథను అందిస్తున్న ఈ సినిమాలో మోహన్ లాల్ తో పాటు కళ్యాణీ ప్రియదర్శన్, మీనా, లలూ అలెక్స్, మురళీగోపీ, కనిహా, సౌబిన్ షహీర్ ఇతర కీలక పాత్రలు పోషించబోతున్నారు. ఆంటోని పెరుంబవూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దీపక్ దేవ్ సంగీతం అందిస్తున్నాడు.

ఆ మధ్య మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం -2’, అలానే ఇటీవల పృథ్వీరాజ్ నటించిన ‘కోల్డ్ కేస్’ చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యాయి. దాంతో ‘బ్రో డాడీ’ మూవీని కూడా ఓటీటీ కోసమే తీస్తున్నట్టు ప్రచారం జరిగింది. దీనిని దర్శక నిర్మాతలు ఖండిస్తూ, థియేట్రికల్ రిలీజ్ ను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాను తీస్తున్నామని స్పష్టం చేశారు. కొవిడ్ 19కు సంబంధించిన అన్ని జాగ్రత్తలూ తీసుకుని ఈ సినిమా షూటింగ్ ను జరుపుతున్నట్టు చిత్ర బృందం తెలిపింది. మోహన్ లాల్ – పృథ్వీరాజ్ కాంబోలో వచ్చిన ‘లూసిఫర్’ చిత్రమే ఇప్పుడు చిరంజీవి – మోహన్ రాజ్ కాంబినేషన్ లో తెలుగులో రీమేక్ కాబోతోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-