సూపర్ స్టార్… ఆర్గానిక్ ఫార్మింగ్!!

లాక్ డౌన్ పుణ్యామా అని గత యేడాది చాలామంది ఫిల్మ్ సెలబ్రిటీస్ ఇంటికే పరిమితం అయిపోయారు. క్షణం తీరిక లేకుండా గడపడం అలవాటైన కొందరు సెలబ్రిటీస్ లాక్ డౌన్ టైమ్ ను కూడా బాగానే ఉపయోగించుకున్నారు. చాలామందిలానే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తాను దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్ తో పాటు ఆర్గానిక్ ఫార్మింగ్ మీద దృష్టి పెట్టారు. ఎర్నాకుళం లోని తన ఇంటి పక్కనే ఉన్న విశాలమైన స్థలంలో వంకాయ, దోసకాయ, కాకరకాయ, సొరకాయ వంటి కూరగాయలను పండించాడు. ఇవాళ ఆరోగ్య పరంగానూ చాలామంది సేంద్రియ ఎరువులతో పెరిగిన కాయగూరలనే ఎక్కువ వాడుతున్నారు. దాంతో వాటి డిమాండ్ బాగా పెరిగిపోయింది. కొంతమంది దీనిని వ్యాపారంగా మార్చుకుంటే, మరి కొందరు తమ ఇంటికి అవసరమైన కూరగాయలను పండించడం ఓ వ్యాపరంగా పెట్టుకున్నారు. మొక్కలు పెంచడానికి స్థలం లేనివారు ‘మిద్ది సేద్యం’ చేస్తున్నారు. మోహన్ లాల్ మాత్రం సేంద్రియ వ్యవసాయం విషయంలో తన తోటి నటీనటులు, అభిమానులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన సోషల్ మీడియా నెట్ వర్క్ లో పోస్ట్ చేశారు. మోహన్ లాల్ లాంటి వ్యక్తి మంచి మాటలు చెబితే దానిని ఆచరించేవారు లక్షల్లో ఉంటడం ఖాయం. మరి ఈ సేంద్రియ వ్యవసాయంతో ఎంతమంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-