నటుడు మోహన్‌బాబు ఇంట్లో విషాదం

సీనియర్ నటుడు, నిర్మాత మోహన్‌బాబు నివాసంలో విషాదం నెలకొంది. మోహన్‌బాబు సోదరుడు రంగస్వామి నాయుడు గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రంగస్వామి నాయుడు చనిపోయినట్లు తెలుస్తోంది. ఆయన వయసు 63 సంవత్సరాలు. కొంత కాలంగా రంగస్వామినాయుడు అనారోగ్యంతో బాధ పడుతున్నారు. తిరుపతిలో ఉంటూ వ్యవసాయం చేసుకునే ఆయన… మోహన్‌బాబు చేపట్టే పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు అని సన్నిహితులు చెప్తున్నారు.

Read Also: వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి చేయాలి: చిరంజీవి

కాగా రంగస్వామినాయుడు మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కాగా గురువారం ఉదయం రంగస్వామి అంత్యక్రియలు తిరుపతిలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి మంచు ఫ్యామిలీతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.

Related Articles

Latest Articles