మోహన్ బాబును సర్ప్రైజ్ చేద్దామనుకున్న చిరంజీవి… కానీ…!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన తాజా చిత్రం “సన్నాఫ్ ఇండియా” సినిమా టీజర్ కు వాయిస్ ఓవర్ అందించిన చిరంజీవి, అలాగే టీజర్ రిలీజ్ చేసిన సూర్య గురించి ఒక స్పెషల్ నోట్ విడుదల చేశారు. “నేను సన్ ఆఫ్ ఇండియా అనే చిత్రాన్ని తీస్తున్నాను అని నా అభిమానులకు, ప్రేక్షకులకి తెలుసు. సన్ ఆఫ్ ఇండియా చిత్రానికి ప్రారంభంలో వాయిస్ ఓవర్ అవసరమైంది. విష్ణు వెంటనే చిరంజీవి అంకుల్ వాయిస్ అయితే బాగుంటుంది అన్నాడు. చిరంజీవి ఫోన్ చేసి అడిగాను. ఎన్ని రోజులు కావాలి బాబు అన్నాడు. పది రోజులు ఎప్పుడైనా ఓకే అన్నాను. వాయిస్ ఓవర్ మెటర్ నాకు పంపు అన్నాడు. పంపాను. ఆచార్య షూటింగ్ లో బిజీగా ఉన్న చిరంజీవి నేను అడిగిన మూడు రోజుల్లోనే నాకు చెప్పకుండా అనే థియేటర్ బుక్ చేసి, తనే డబ్బింగ్ చెప్పి పంపాలి అనుకున్నాడు. ఆ మేటర్ నాకు తెలిసింది. డబ్బింగ్ ధియేటర్ కి విష్ణు ను పంపాను. విష్ణు బాబు ని చూడగానే చిరంజీవి నవ్వుతూ నిన్ను ఎవరు రమ్మన్నారు… డబ్ చేసి మీ నాన్న సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను అన్నాడు. అంత గొప్ప మనసు ఎవరికుంటుంది. నేను అడగగానే ఇంత గొప్పగా స్పందించిన చిరంజీవి తీరుకి, అతని సహృదయతకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. సూర్య సన్ ఆఫ్ ఇండియా టీజర్ ని జూన్ 4న మీ చేతుల మీదుగా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పాను. వెంటనే అతను మీరు ఎందుకు సార్ పెద్దవారు నాకు చెప్తారు… నేను మీ ఫ్యామిలీ మెంబర్ ని, నేను విషయం మాట్లాడి, ఏం చేసుకుంటాం… నువ్వు చెప్పిన టైంకి టీజర్ రిలీజ్ అవుతుందని రిలీజ్ చేశాడు. నా మీద ఉన్న ప్రేమకు ధన్యవాదములు. సన్ ఆఫ్ ఇండియా టీజర్ కి నుంచి ప్రేక్షకులు అభిమానులూ స్పందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. త్వరలో సన్ ఆఫ్ ఇండియా కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాం” అంటూ చిరంజీవికి, సూర్యకు థాంక్స్ చెప్పారు మోహన్ బాబు.

కాగా మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. నిజజీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. “సన్ ఆఫ్ ఇండియా” చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజ‌ర్ తమిళ స్టార్ హీరో సూర్య చేతుల మీదుగా విడుద‌లైంది. మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్ ఓవ‌ర్ తో ఈ టీజ‌ర్ ప్రారంభ‌మ‌వుతోంది. టీజర్లోని డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-