‘సన్ ఆఫ్ ఇండియా’ టీజర్ అప్డేట్

సీనియర్‌ నటుడు మోహన్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై విష్ణు మంచు నిర్మిస్తున్నారు. వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకొంటున్న ఈ సినిమా టీజర్‌ని ఈ నెల 4న విడుదల చేయనున్నారు. మోహన్‌బాబు 30 ఏళ్ల కిందట నటించిన ‘అసెంబ్లీ రౌడీ’ విడుదలైన రోజు అది. ఆ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ప్రత్యేకత వల్లే ఈ నెల 4న ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ టీజర్‌ని విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించినట్టు తెలుస్తోంది. మంచి సందేశం కలబోసిన ఈ సినిమా అన్ని వర్గాలను మెప్పిస్తుందని చిత్రబృందం భావిస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-