కల నెరవేరింది అంటూ మోహన్ బాబు కీలక ప్రకటన

సీనియర్ హీరో మోహన్ బాబు తన విద్యా సంస్థ శ్రీ విద్యానికేతన్‌ కీలక ప్రకటన చేశారు. నిన్ననే మోహన్ బాబు తనయుడు, మంచు విష్ణు తన తండ్రి ఈరోజు ఒక ముఖ్యమైన ప్రకటన చేయబోతున్నారు అంటూ అసలు విషయం చెప్పకుండా సస్పెన్స్ లో పెట్టేశారు. అయితే ఆ సస్పెన్స్ కు తెరదించారు తాజాగా మోహన్ బాబు. ‘శ్రీ విద్యానికేతన్‌లో వేసిన విత్తనాలు ఇప్పుడు కల్పవృక్షంగా మారాయి. మీ 30 సంవత్సరాల విశ్వాసం, నా జీవిత లక్ష్యం ఇప్పుడు వినూత్న అభ్యాస విశ్వంలోకి చేరుకుంది. కృతజ్ఞతతో తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీని మీకు అందిస్తున్నాను. మీ ప్రేమే నా బలం, మీరు కూడా ఈ కలకి మద్దతు ఇస్తారని నేను విశ్వసిస్తున్నాను’ అంటూ మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా తన కల నెరవేరింది అన్న విషయాన్ని ప్రకటించారు.

Read Also : నా సినిమాకే పోటీనా అన్నాడు ?… రామ్ చరణ్ వ్యక్తిత్వంపై స్టార్ డైరెక్టర్ కామెంట్స్

పద్మశ్రీ మోహన్ బాబు మూడు దశాబ్దాలకు పైగా సినిమా రంగంలో ఉన్నారు. ఆయన కెరీర్‌లో చాలా విభిన్నమైన పాత్రలు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనే రాణించిన ఆయన విద్యా రంగంలోకి కూడా ప్రవేశించాడు. తిరుపతిలో ప్రసిద్ధ శ్రీ విద్యా నికేతన్‌ను అనే విద్యాసంస్థను ప్రారంభించాడు. ఇప్పుడు మోహన్ బాబు ఓ అడుగు ముందుకేసి తిరుపతిలో ఎంబీయూ యూనివర్సిటీ పేరుతో ‘మోహన్ బాబు యూనివర్సిటీ’ని ప్రారంభించడం విశేషం.

Related Articles

Latest Articles