జాతిని ఉద్దేశించి మాట్లాడనున్న మోడీ…

కరోనా మహమ్మరి ప్రపంచాన్నే అల్లకల్లోలం చేసింది. కరోనా బారినపడి ఎంతో మంది జీవితాలు అతలాకుతలం అయ్యాయి. కరోనాతో ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్దాయి. కరోనాను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం కొవిడ్‌ టీకాలను తీసుకువచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టీకా ఉత్సవ్ విజయవంతమవుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయం వ్యక్తం చేశారు. చైనా తరువాత 100 కోట్ల కొవిడ్‌ టీకాలు పంపిణీ మైలురాయి దాటిన రెండవ దేశంగా భారతదేశం చరిత్ర లిఖించింది.

అంతేకాకుండా కొవిడ్‌ టీకాలపై అపోహలు పక్కన పెట్టి ప్రజలు నమ్మి కొవిడ్‌ టీకాలు వేయించుకున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి మాట్లాడానున్నట్లు ట్విట్టర్‌ వేదికగా పీఎంవో ఒక ప్రకటన చేసింది. దేశంలో కొవిడ్ టీకా 100 కోట్ల మైలురాయిని దాటిన సందర్భంగా ఆయన జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. అంతేకాకుండా ఈ విజయానికి కృషి చేసిన ఆరోగ్యశాఖ వైద్యులు, నర్సులు, కార్మికులు ప్రతి ఒక్కరిని అభినందించే అవకాశం ఉంది.

Related Articles

Latest Articles