వడ్ల కొనుగోలుపై కూడా మోడీ ఒక నిర్ణయం తీసుకోవాలి : మంత్రి నిరంజన్‌ రెడ్డి

దేశంలోనే తెలంగాణలో వరీ ఎక్కువ విస్తీర్ణంలో పండుతోందని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ప్రవేశపెట్టిన రైతుసాగుచట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. అయితే తాజా ప్రధాని నరేంద్ర మోడీ ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. రేపు సీతారామ ప్రాజెక్ట్ తర్వాత రైతులు ఇంకా ఎక్కువ పంట వేస్తారని, పంట కొనం అంటే రైతుల కాళ్ళు కట్టేసినట్లేనన్నారు.

తెలంగాణలో ఏడాది పాటు పండే వరి పంట కేంద్రమే కొనాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలన్నారు. స్టాక్స్ ఎక్కువ అయ్యాయి అంటే దానికి మీరే బాధ్యత అని, వడ్ల కొనుగోలు విషయంలో కూడా ప్రధాని మోడీ ఒక నిర్ణయం తీసుకోవాలి అని ఆయన కోరారు. తెలంగాణ ధాన్యం కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన క్రమంలో.. టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ స్వయంగా ఇందిరా పార్క్‌ వద్ద మహాధర్నాకు దిగారు. ఆ మహాధర్నాపై స్పందించిన కేంద్రం త్వరలోనే స్పందిస్తామని హామి ఇచ్చింది.

Related Articles

Latest Articles