ఒమిక్రాన్‌ వేరియంట్‌ : కేంద్రం కొత్త గైడ్ లైన్స్ ఇవే !

ప్రస్తుతం ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇండియాను వణికిస్తోంది. ఈ నేపథ్యంలోనే… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్‌ అయ్యాయి. ఇక తాజాగా ఎయిర్‌ పోర్టుల్లో కొత్త వేరియంట్‌ పై కేంద్రం గైడ్‌ లైన్స్‌ కూడా విడుదల చేసింది. ఒమిక్రాన్‌ ప్రభావం ఉన్న దేశాల నుంచి వస్తే… టెస్టింగ్‌ తప్పని సరి అని కేంద్రం తాజాగా ప్రకటన చేసింది. వ్యాక్సిన్‌ తో సంబంధం లేకుండా… ఎయిర్‌ పోర్ట్‌ లో టెస్టింగ్స్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఒక వేళ ఎయిర్‌ పోర్ట్‌ లో పాజిటివ్‌ వస్తే.. నేరుగా క్వారంటైన్‌ కు తరలించాలని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ తప్పనిసరి అని ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. నెగిటివ్‌ వస్తేనే ఎయిర్‌ పోర్టు నుంచి బయటకు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసింది. శాంపిల్స్‌ సేకరించి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం తరలించాలని పేర్కొంది కేంద్ర ప్రభుత్వం. ఒమిక్రాన్‌ వేరియంట్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం.

Related Articles

Latest Articles