ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించిన కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పేదలకు ఉచితంగా అందిస్తున్న 5 కిలోల ఉచిత రేషన్‌ పంపిణీని వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. కరోనా లాక్‌డౌన్ అనంతరం పేద ప్రజలకు సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా ప్రతి నెల 5 కిలోల బియ్యం, కిలో గోధుమలను ఉచితంగా అందిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ ఈ పథకాన్ని కేంద్రం అమలు చేసింది.


Read Also: భారీ బడ్జెట్ చిత్రాలకు ఏపీ ప్రభుత్వం షాక్!

అయితే ఇటీవల ఈ కార్యక్రమాన్ని పొడిగించే ఉద్దేశం తమకు లేదని కేంద్ర ఆహార కార్యదర్శి సుదర్శన్ పాండే వెల్లడించారు. దీంతో ఈ పథకాన్ని కేంద్రం నిలిపివేస్తుందని ప్రచారం జరిగింది. కానీ త్వరలో పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పథకాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఉచిత రేషన్ పథకం ద్వారా 80 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందనున్నారు.

Related Articles

Latest Articles