ఒక్కసారి కాదు వందసార్లు కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తా : ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి

మొన్నటి వరకు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన వెంకట్రామిరెడ్డి ఎన్నో ఆరోపణలు, విమర్శల నడుమ ఎమ్మెల్సీ పదవిని పొందారు. అయితే టీఆర్‌ఎస్‌ పార్టీ ఇందిరాపార్క్‌ వద్ద చేస్తోన్న మహాధర్నాలో పాల్గొన్న ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని అన్నారు. కేసీఆర్ కృషితో గతంలో కంటే 600 శాతం ఎక్కువ ధాన్యం పండుతోందని, రైతుల పంటలు కేంద్రం ఎందుకు కొనుగోలు చేయదని, అకస్మాత్తుగా రైతులు వరి పంట పండించొద్దని అంటే ఎలా..? అని ప్రశ్నించారు.

కేసీఆర్ చాలా ముందు చూపు ఉన్న వ్యక్తి అని, కేసీఆర్ కి ఒక్కసారి కాదు వందసార్లు పాదాభివందనం చేస్తానంటూ ఆయన వ్యాఖ్యానించారు. ‘కేసీఆర్ నాకు దేవుడుతో సమానం. తెలంగాణ ప్రజలకు తండ్రి సమానులు. నా పొలిటికల్ ఎంట్రీ పై ప్రతిపక్షాలు అర్థం లేని విమర్శలు చేస్తున్నాయి. అందరూ ముఖ్యమంత్రుల వద్ద పని చేశానంటే వాళ్ళు నన్ను, నా పని తనాన్ని మెచ్చుకుని పదవులు ఇచ్చారు.

అందరు ముఖ్యమంత్రుల మన్ననలు పొందానంటే నేనేంటో తెలుసుకోవాలి. కేసీఆర్ పని విధానానికి ఆకర్షితుడినై టీఆర్ఎస్ లో చేరాను. కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటా. కలెక్టర్ పదవి వదిలి పెట్టి రాజకీయ నేతగా ఎదిగిన తర్వాత రైతుల పక్షాన ఉద్యమం చేయడం సంతోషంగా ఉంది’ అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Related Articles

Latest Articles