టీఆర్ఎస్ అంతర్గత ఆధిపత్య పోరుతోనే ఉప ఎన్నికలు..!

టీఆర్ఎస్ అంతర్గత ఆధిపత్య పోరుతోనే హుజురాబాద్‌లో ఉప ఎన్నికలు వచ్చాయని విమర్శించారు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి… హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని మామిడాలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూర్ వెంకట్ తరపున ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరలుఉ ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ. టీఆర్ఎస్ అంతర్గత ఆధిపత్య పోరుతో ఉప ఎన్నికలు వచ్చాయని ఆరోపించారు.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు మంత్రిగా పనిచేసిన ఈటల ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదని టీఆర్ఎస్ పార్టీ అంటుంది అని ఎద్దేవా చేశారు.

ఇక, అసమర్థ రాజకీయ పార్టీ ఒకవైపు, అసమర్థ అభ్యర్థి మరోవైపు ఉప ఎన్నికల్లో ఉన్నారని.. వారిద్దరికీ ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కులేదని మండిపడ్డారు ఎమ్మెల్సీజీవన్‌రెడ్డి.. 2004లోనే వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత కరెంట్‌ను అందించింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.. రైతు బాగుంటేనే కూలి బాగుంటాడు.. రైతుల పక్షపాత పార్టీ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేసిన ఆయన.. కాంగ్రెస్ హయాంలో పేద ప్రజలకు తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను అందించాం అని గుర్తు చేశారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను పెంచిన పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలని అని ప్రశ్నించిన జీవన్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

-Advertisement-టీఆర్ఎస్ అంతర్గత ఆధిపత్య పోరుతోనే ఉప ఎన్నికలు..!

Related Articles

Latest Articles