కేటీఆర్ సమస్యను పక్కదారి పట్టిస్తున్నాడు…

యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలతో బానిసలుగా మారుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీని నివారించడంలో విఫలమైందని చెప్పక తప్పడం లేదు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ కి రేవంత్ రెడ్డి ఇంటి పైన జరిగిన దాడికి కండిస్తున్నాం. ప్రజాస్వామ్యం లో ఇది ఒక పిరికిపందలు చేసే హీనమైన చర్య అని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు బండి సంజయ్ తన వైట్ ఛాలెంజ్ ఒకే చేశారు. కేటీఆర్ రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ కి నువ్వు ప్రభుత్వ అధికారిగా నిలబడు అని తెలిపారు. సాయంత్రం అయితే నువ్వు ఎక్కడ ఉంటావో అందరికి తెలుసు అని చెప్పిన కేటీఆర్ సమస్యను పక్కదారి పట్టిస్తున్నాడు అన్నారు.

ఇక లక్షలాది నిరుద్యోగులు రోడ్డు పై పడ్డారు… వారికి నిరుద్యోగ భృతి లేదు. కోవిడ్ వలన 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. లక్ష కోట్ల మద్యం విక్రయాలు కొనసాగుతున్నయీ అంటే రాష్ట్రం ఎటు వెళుతుంది. తెలంగాణ లో ఏ ఊరుకు వెళ్లిన మద్యం దొరుకుతుంది దీని కోసమేనా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం అని ప్రశ్నించారు. పప్పూ దినుసులు నూనె గింజలకు మద్దతు ధర ప్రకటించాలి. షుగర్ ఫ్యాక్టరీ ని వెంటనే ఓపెన్ చేయాలి అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఇలాంటి భౌతిక దాడులను ప్రోత్సహించడం సరికాదు. ఇకనైనా మీ తీరును మార్చుకోండి అని సూచించారు జీవన్ రెడ్డి.

-Advertisement-కేటీఆర్ సమస్యను పక్కదారి పట్టిస్తున్నాడు...

Related Articles

Latest Articles