చంద్రబాబూ విధి ఎవరినీ విడిచిపెట్టదు-ఎమ్మెల్యే రోజా

నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్ కె రోజా మాజీ సీఎం చంద్రబాబునాయుడిపై తనదైన రీతిలో విమర్శలు చేశారు. రోజా బ్లూ ఫిలిమ్స్ లో యాక్ట్ చేసిందని సీడీలు చూపించింది మర్చిపోయావా బాబు అన్నారు రోజా. విధి ఎవరినీ విడిచిపెట్టదన్నారు.

72 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ ని ఎంతగా ఏడిపించావో గుర్తుందా? 71 ఏళ్ళ 7 నెలలకే నీకా పరిస్థితి వచ్చింది. అందుకే అంటారు మనం ఏం చేస్తే మనకి అదే పరిస్థితి వస్తుందని. నీ భార్యని ఏదో అనేశారని బాధపడుతున్నావ్. ఆనాడు హైదరాబాద్ లో పీతల సుజాత ద్వారా మీడియా పాయింట్ లో నేను బ్లూ ఫిల్మ్ లో నటించానని సీడీలు చూపించావ్ మరిచిపోయావా. నాకు ఫ్యామిలీ లేదా? నాకు పిల్లలు లేరు? నాకు గౌరవం లేదా? ఎవరిని ఏదైనా అంటాం. అధికారంలో వుంటే ఏదైనా చేయవచ్చా?

భారతిని ఏం అన్నావో, షర్మిలమ్మని ఏమన్నావో గుర్తులేదా? అధికారంలో వుండగా నీవేం చేశావో అందరికీ తెలుసు. హైదరాబాద్లో నన్ను నిబంధనలకు విరుద్ధంగా ఇబ్బంది పెట్టావ్. సస్పెండ్ చేశావ్. నన్ను మానసికంగా ఇబ్బందికి గురిచేశావ్. చంద్రబాబునాయుడు నేను చాలా హ్యాపీగా వున్నాను. నీవు ఏడిపించినవి నీకు తగిలాయ్. దేవుడు నిన్ను జీవితాంతం అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వడు. బై బై బాబు.. బైబై అంటూ నిప్పులు చెరిగారు రోజా.

Related Articles

Latest Articles