గ్లామర్ అవతారంలో ఎమ్మెల్యే రోజా.. ఫైర్ అవుతున్న నెటిజన్స్

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రోజా.. ఒకపక్క రాజకీయాలు మరోపక్క షోలతో బిజీగా మారింది. ప్రత్యర్థుల మీద వ్యంగ్యాస్త్రాలు వేయాలన్నా.. షోలో పంచులు వేయాలన్న ఆమెకే చెల్లింది. ఫైర్ బ్రాండ్ నాయకురాలు అయి ఉండి కూడా ఇప్పటికీ.. గ్లామర్ కు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇక రోజా అందం గురించి మాట్లల్లో చెప్పాల్సిన అవసరం లేదు.. ఇప్పటికీ ఆమె హాట్ బ్యూటీనే.. ఎలాంటి డ్రెస్ వేసుకున్నా ఆమె అందం వర్ణించలేనిది అని అభిమానులు అంటూ ఉంటారు.

ఇక తాజాగా రోజా గ్లామర్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.. ఎల్లో కలర్ టాప్ లో రోజా ఆకట్టుకొంటుంది. ఈ ఫోటోలపై కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు.. ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి .. ఇంకా ఇలాంటి బట్టలు వేసుకోవడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఎవరి ఇష్టం వారిది.. ఆమె ఆ బట్టలు వేసుకొని అసెంబ్లీకి అయితే రావడం లేదు కదా.. ఎవరి కంఫర్ట్ ని బట్టి వారు దుస్తులు ధరిస్తారు అని చెప్పుకొస్తున్నారు. ఫైర్ బ్రాండ్ గా ఆమె మాటలు ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తాయో.. ఆమె చేసే ప్రతి పని అంతటి సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.

Related Articles

Latest Articles