ఓరుగల్లు టీఆర్‌ఎస్‌లో జోష్‌..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక వరంగల్‌లో తీన్మార్‌ మోగిస్తుంది. కారు పార్టీ పుల్‌ జోష్‌ మీదుంది. ముగ్గురు నేతలను ఒకేసారి ఎంపిక చేయడం మంత్రి పదవులు సైతం దక్కే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో కారు పార్టీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికైనా ఉమ్మడి వరం గల్‌ జిల్లాకు చెందిన బండా ప్రకాష్‌, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, కడి యం శ్రీహరి పేర్లను కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెల్సిందే.. రాజకీ య అనుభవం, సీనియర్‌ కోటాలో కడియంకు, పార్టీకి అంకితభావం, నిబద్ధతతో పనిచేసినందుకు తక్కెళ్లపల్లికి, ముదిరాజ్‌ సామాజిక వర్గం దూరం కాకుడదనే కోణంలో బండా ప్రకాష్‌కు అవకాశం దక్కింది. వాస్త వానికి ఉమ్మడి వరంగల్‌ నుంచి జిల్లా నుంచి చాలామంది నేతలు ఎమ్మెల్సీ పదవులకు పోటీ పడ్డారు. దాదాపు 10 మంది నేతలు తీవ్రంగా ప్రయత్నం చేశారు. అయితే కేసీఆర్‌ మాత్రం అన్ని సమీకరణాల దృష్య్టా వీరి వైపే మొగ్గు చూపారు. దీంతో జిల్లాకు దక్కిన ప్రాధన్యం గురించి చర్చించుకుంటున్నారు.

వాస్తవానికి సుదీర్ఘకాలంగా తక్కెళ్లపల్లి రవీందర్‌రావు పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే టిక్కెట్‌ కోసం, ఎమ్మెల్సీ పదవులకు ఎంపి క ప్రతిపాదన వచ్చిన ప్రతీసారి తక్కెళ్లపల్లి పేరు రావడం వీగిపోవడం పరిపాటిగా మారింది. కానీ ఈసారి మాత్రం ఉద్యమ సమయంలో ఆయన చేసిన సేవలను గుర్తు పెట్టుకుని పిలిచి మరీ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఉద్యమ నేతలను పార్టీలో పట్టించు కోవడం లేదన్న విమర్శలకు తక్కెళ్లపల్లి ఎంపికతో కాస్త చెక్‌ పెట్టినట్టు అయిందని గులాబీ నేతలు అంటున్నారు.

కడియం శ్రీహరికి ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను వరంగల్‌లో ఘనంగా నిర్వహించాలని భావించినప్పుడే కేసీఆర్‌ ప్రత్యేకంగా హైద్రాబాద్‌ పిలిపించుకుని మాట్లాడారు. ఆయనపై ఎలాం టి అవినీతి ఆరోపణలు లేకపోవడంతో మొదటి నుంచి పార్టీలో ప్రాధా న్యం కల్పిస్తు వస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పనిచేయడమే ఇందుకు నిదర్శనం. సిట్టింగ్‌లకే టిక్కెట్లు అనే ప్రాతిపదికన కేసీఆర్‌ కట్టుబడి ఉండటంతో స్టేషన్‌ఘన్‌పూర్‌ టిక్కెట్‌ కడియం ఆశించినా దక్కలేదు. అదే సమయంలో కడియంకు ఎమ్మెల్సీ ఇచ్చి పార్టీలో ప్రాధాన్యం కల్పించారు. అయితే, మంత్రివర్గంలోకి తీసుకుంటారని అనుకున్నా జరగలేదు. తాజాగా కడియంను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయ డంపై మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతుంది.

కడియం శ్రీహరి, రవీందర్‌రావుల పేర్లు ముందునుంచి వినిపించినా బండా ప్రకాష్‌ ఎంపికకు మాత్రం ముదిరాజ్‌ సామాజిక కోణంలోనే కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్లుగా చర్చ జరుగుతుంది. జిల్లాకే చెందిన మాజీ స్పీకర్‌ మధుసూదనచారి పేరు చివరివరకు విని పించినా.. అనుహ్యంగా అధినేత బండాప్రకాష్‌కు అవకాశం కల్పిం చడం గమనార్హం. ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరడంతో ఆ సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉండేందుకు, ఆ సామాజిక వర్గం ఓటు బ్యాంకు పార్టీ నుంచి దూరం కాకుండా ఉండేందుకు ఈ ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన్ను మంత్రి వర్గంలోకి తీసుకుంటారన్న ఊహగానాలు వినిపిస్తున్నాయి.

Related Articles

Latest Articles