మానవత్వానికి మరో రూపం మైనంపల్లి హన్మంతరావు

ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మానవత్వాన్ని చాటుకున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట ప్రాంతవాసి కార్మిక నాయకుడు, వెంకటరమణ అనారోగ్యంతో పదిరోజుల క్రితం మృతి చెందాడు. కాగా ఆయన బ్రతికుండగానే ఆయన కూతురు ఆత్మహత్య చేసుకోగా, ఆమెకు ఒక చిన్న కూతురు ఉంది. దీంతో ఆ చిన్నారి పరిస్థితి చూసి అంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ చిన్నారికి అన్నివిధాలుగా అండగా ఉంటానని చిన్నారిని చదివించి ప్రయోజకురాలిని చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హామీ ఇచ్చారు. అంతేకాదు, ఆ చిన్నారి పేరు మీద ఐదు లక్షల రూపాయలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, స్థానిక కార్పొరేటర్లు నాయకులు ఉన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-