టీడీపీతోనే బీజేపీ మిలాఖత్.. సోము వీర్రాజుకి కాకాని కౌంటర్

టీడీపీతో బీజేపీ నేతలు మిలాఖత్ అయ్యారని ఆరోపించారు ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి. సోము వీర్రాజు వ్యాఖ్యలపై కాకాని గోవర్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీడీపీ నాయకులతో వైసిపి నాయకులు మిలాఖత్ అని మాట్లాడుతున్న సోమువీర్రాజు మీతో తిరుగుతున్న నాయకులు మీ పార్టీ నాయకులేనా.. టీడీపీ నాయకులా అని ప్రశ్నించారు. సోమువీర్రాజు ఆయన బిజెపి శ్రేణులే టీడీపీ సహకారంతో ఎన్నికలను ఎదుర్కొంటున్నారన్నారు. బద్వేల్ ఎన్నికలలో భారీ పరాజయం ఖాయం అని బీజేపీ ముందే డిసైడ్ అయ్యి ఓటమికి కారణాలను ఇప్పటి నుంచి సోము వీర్రాజు టీం రెడీ చేస్తోందన్నారు.

Read Also: బద్వేల్‌ ఉపపోరు…ఆ రెండు పార్టీలకు షాక్ తప్పదా?

బద్వేలులో నీటి సమస్యపై సోమువీర్రాజు విసిరిన సవాల్‌ను వైసీపీ స్వీకరిస్తోందని, దీనిపై సమగ్రమయిన చర్చకు సోమువీర్రాజు రెడీ కావాలన్నారు. బద్వేలు ప్రజలకు త్రాగినీరు ఇచ్చింది వైయస్ రాజశేఖర్ రెడ్డి తరువాత వైయస్ జగన్ రెడ్డిలు మాత్రమే అన్నారు కాకాని. రోడ్లు , డ్రైనేజీ ల సమస్య పరిష్కారం వైసీపీ ప్రభుత్వం లోనే దొరుకుతుందన్నారు. బీజేపీకి బద్వేలు లో ఓటు హక్కు అడిగే అవకాశమే లేదన్నారు. అసలు బీజేపీ వల్ల బద్వేలుకి ఓరిగేదేం లేదన్నారు. బీజేపీకి ఓటేస్తే మురిగిపోతుంది తప్ప ప్రయోజనం లేదన్నారు కాకాని.

రేపటి నుంచి చంద్రబాబు అని ఎందుకు పిలవాలి బోసడీకే బాబు అని పిలిస్తే , బోసడీకె లోకేష్ అని పిలిస్తే ఏం ఇబ్బంది లేదా ? అన్నారు. వైసీపీ అభిమానులు సంయమనంతో ఉన్నారు కాబట్టే చంద్రబాబు ఆంద్రప్రదేశ్ లో తిరుగుతున్నారన్న విషయం బాబు కో కు తెలియదా అన్నారు కాకాని. టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కాస్తా ఇప్పుడు బీజేపీ వర్సెస్ వైసీపీ యుద్ధంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Related Articles

Latest Articles