రివ్యూల పేరుతో సమావేశాలు తప్పా సీఎం చేసిందేమీ లేదు : జగ్గారెడ్డి

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షకు హాజరు అయ్యారు సంగా రెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రోడ్ల పైకి వచ్చి రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారు. తెలంగాణ వస్తే ఆందోళనలు, ధర్నాలు ఉండవని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఏమి చేస్తుంది. ధాన్యం తరలింపు సక్రమంగా లేదు.. తీవ్ర ఇబ్బందులున్నాయి. ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు తప్ప అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి నష్ట పోయిన రైతులకు పూర్తి స్థాయి నష్ట పరిహారం చెల్లించాలి అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద సొసైటీ లు దోపిడీకి పాల్పడుతున్నాయి. ముఖ్యమంత్రి ప్రాపకం కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారే తప్ప వారికి రైతుల సమస్యలు తీర్చే సమయం ఉండటం లేదు. ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకునేంతవరకు మా ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయి. రైతుల సమస్యలు పట్టించుకోవడం లో జిల్లా మంత్రి హరీష్ రావు శ్రద్ధ చూపడం లేదు. రివ్యూ ల పేరుతో సమావేశాలు పెట్టడం తప్పా రైతులకు చేసిందేమీ లేదు అని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-