టీడీపీ సవాళ్ళను స్వీకరించిన అధికార పార్టీ…

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీ సవాళ్ళను స్వీకరించింది అధికార పార్టీ. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ మాట్లాడుతూ… ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లతో గెలిసిన టీడీపీ నేతలు చంద్రబాబు బంట్రోతుగా పని చేస్తున్నారు. టీడీపీ నేతల ఉత్తరాంధ్ర రక్షణ సమావేశం చూసి ప్రజలు సిగ్గు పడుతున్నారు. ఉత్తరాంధ్రను భక్షించిన వాళ్లే రక్షణ అంటూ మాట్లాడుతున్నారు. టీడీపీ నేతలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పిన సిగ్గు రాలేదు అన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తే చంద్రబాబు అడ్డుకుంటున్నారు..అమరావతి కోసం విశాఖకు అన్యాయం చేస్తున్నారు. అమరావతిపై చంద్రబాబుకు ఉన్నది కమర్షియల్ ఎటాచ్ మెంట్ మాత్రమే. విశాఖకు చంద్రబాబు అన్యాయం చేస్తుంటే ఎందుకు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు నోరు మెదపలేదు అని తెలిపారు.

అయితే చంద్రబాబు భజన చేసేందుకే టీడీపీ నేతలు సమావేశం పెట్టినట్లు ఉంది. టీడీపీ ఉద్దండులు దద్దమ్మలా సమావేశంలో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేశామని టీడీపీ నేతలు బస్సు యాత్ర చేయాలి. అభివృద్ధి చేస్తే ప్రజలు ఓడించారని అచ్చెన్నాయుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. జిల్లాలు వారిగా చంద్రబాబు ప్రకటించిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. విశాఖలో లక్ష ఎకరాల భూములను టీడీపీ నేతలు కాజేశారు. చంద్రబాబు హుద్ హుద్ సమయంలో వారం రోజులు పాటు వైజాగ్ లో ఉన్నపుడు రికార్డులు మాయమయ్యాయి. నేపాల్ గూర్ఖాలకు సూటు బూటు వేసి వారితో చంద్రబాబు ఎంవోయూలపై సంతకాలు చేయించుకున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చకు టీడీపీ నేతలతో మేము సిద్ధము. మాతో చర్చకు టీడీపీ నేతలు సిద్ధమా అని సవాల్ విసిరారు. చంద్రబాబుతో కుమ్మకై కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేయడం వలన కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది అని పేర్కొన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-