హుజురాబాద్ లో మీ రాజకీయాలు నడవవు : ఈటల

మా ప్రాంతానికి ఇంఛార్జ్ గా వస్తున్న వాళ్ళు ఇక్కడి ప్రజాప్రతినిధులు గెలుపులో ఏమన్నా సాయం చేశారా అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మాకు సహకరించకపోతే ఊరుకునేది లేదు అంటారా..సర్పంచ్ లకు ఎంపిటిసి లకు నిధులు రావు మీ గ్రామాలు అభివృద్ధి కావు అంటూ బెదిరిస్తున్నారు. మంత్రి కాక ముందు సంస్కారం లేకపోతే మంత్రి అయ్యాక అయినా సంస్కారం నేర్చుకోవాలి. కరీంనగర్ ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు వాళ్ళని చూసుకోవాలి తప్ప హుజురాబాద్ పై కక్ష కట్టవో ప్రజలకు తెలుసు.

కరీంనగర్ ను బొందల గడ్డగా చేసిన చరిత్ర మీది అని అందరికి తెలుసు అని అన్నారు. ఎన్నికోట్ల సంపద విధ్వంసం అయిందో సీఎం గారికి చెప్పా… ధర్మాన్ని మెక్కుతా న్యాయాన్ని మెక్కుతా … 20 ఏళ్లుగా కలిసి మెలసి బ్రతికన మమ్మల్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నియోజకవర్గము 50 వేలు మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గము. సహచర మంత్రి వస్తాడని తెలిసినది రా చూస్తాం… అనేక ప్రలోభాలకు గురి చేస్తున్నారు.

అప్పుడు 2006 లో కరీంనగర్ లో ఎంపీ గా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు, YS రాజశేఖర్ రెడ్డి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఎంత మందిని కొన్నా తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని గెలిపించారు. ఇప్పుడు హుజురాబాద్ లో కూడా అదే జరుగుతుంది. ప్రజలు అమాయకులు కారు. హుజురాబాద్ లో మీ రాజకీయాలు నడవవు అని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ హుజురాబాద్ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నా.. ఇకపై కూడా ప్రాణం పోయినా ఇబ్బంది కానివ్వను. మీరు చేసిన పనికి ప్రజా ప్రతినిధులు దోషులుగా నిలబడుతున్నారు. మాపై కుట్రలు చేస్తే కరీంనగర్ కేంద్రంగానే మరో ఉద్యమం చేయాల్సి వస్తుంది అని చెప్పిన ఈటల హుజురాబాద్ ప్రజలు ఓపికతో ఉండాలని తెలిపారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-