చంద్రబాబుకు నమస్కారం చేసిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి !

ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా బీభత్సంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో…. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా…చాలా ప్రాంతాల్లో వరదలు విషాదాన్ని సృష్టిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే… ఇవాళ చిత్తూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు.

అయితే చంద్రబాబు పర్యటన సందర్భంగా ఇక్కడ ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాయల చెరువు వద్ద సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ విప్‌, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి చంద్రబాబు కనిపించగానే… లేచి నిల్చొని నమస్కారం చేశారు. చంద్రబాబు ప్రతి నమస్కారం చేశారా ? లేదా ? అన్నది మాత్రం విజువల్స్ లో సరిగ్గా కనిపించలేదు. మొత్తానికి ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Related Articles

Latest Articles