హారర్ కామెడీగా ‘శ్రీ లక్ష్మీ’!

యూత్ ను టార్గెట్ చేస్తూ శ్రీ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ‘బోయ్స్’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్ర కథానాయిక మిత్రా శర్మనే దానిని నిర్మిస్తున్నారు. ఇప్పుడీమె మరో సినిమాను కూడా మొదలెట్టబోతున్నారు. శశి హస్ చెప్పిన హారర్ కామెడీ సబ్జెక్ట్ నచ్చడంతో అతన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మూవీని మొదలెట్ట బోతున్నామని మిత్రా శర్మ తెలిపారు. ఈ రెండో సినిమాకు ‘శ్రీ లక్ష్మీ’ అనే పేరు పెట్టారు. ది ఘోస్ట్ హంటర్ అనేది ట్యాగ్ లైన్. తొలి చిత్రాన్ని కూడా తాను కొత్త దర్శకుడితోనే తీస్తున్నానని, ఇప్పుడీ సినిమాతోనూ డెబ్యూ డైరెక్టర్ ను పరిచయం చేస్తున్నానని నిర్మాత మిత్రా శర్మ చెప్పారు. కథ, కథనం బాగుంటే కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులను తెలుగువారు ప్రోత్సాహిస్తారనే నమ్మకం తనకుందని ఆమె చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న ప్యాండమిక్ సిట్యుయేషన్ తగ్గగానే ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళతామని అన్నారు. ‘శ్రీ లక్ష్మీ’ చిత్రానికి పడవల బాలచంద్ర సహ నిర్మాత కాగా, మార్తండ్ కె వెంకటేశ్ ఎడిటర్, వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్, స్మరణ్ సంగీతం అందిస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-