‘డిస్కో డ్యాన్సర్’ హంగామా : కొడుకు డెబ్యూ మూవీలో తండ్రి స్టెప్పులు!

‘డిస్కో డ్యాన్సర్’గా ఒకప్పుడు యూత్ ను ఉర్రూతలూగించాడు మిథున్ చక్కవర్తి. అయితే, ఇప్పుడు ఆయన వారసుడు నమశి చక్రవర్తి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో ‘బ్యాడ్ బాయ్’ అనే సినిమా చేస్తున్నాడు. హైద్రాబాదీ బ్యూటీ అమ్రిన్ ఖురేషి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే, కొడుకు నమశి మూవీకి ఎక్స్ ట్రా అట్రాక్షన్ గా మిథున్ దా రంగంలోకి దిగాడు. ఓ పాటలో క్యామియో అప్పియరెన్స్ ఇచ్చాడు! రీసెంట్ గా సాంగ్ షూటింగ్ హైద్రాబాద్ లోని ఫిల్మ్ సిటీలో జరిగింది…

కొడుకు నమశితో మిథున్ చక్రవర్తి ఫోటోలు ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారాయి. లెజెండ్రీ స్టార్ తో యంగ్ హీరో సాంగ్ షూటింగ్ పిక్స్ నెటిజన్స్ లో ఆసక్తి రేపాయి. మిథున్ లాంటి సీనియర్ స్టార్ తమ సినిమాలో కనిపించటం ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అవుతుందని ‘బ్యాడ్ బాయ్’ డైరెక్టర్ రాజ్ కుమార్ సంతోషి అన్నాడు. ఇక యంగ్ హీరో, హీరోయిన్ నమశి చక్రవర్తి, అమ్రిన్ ఖురేషి కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 360 చిత్రాల్లో నటించిన అనుభవంతో పాటూ 3 జాతీయ అవార్డ్ లు సాధించిన మిథున్ చక్రవర్తితో స్క్రీన్ షేర్ చేసుకోవటం గర్వంగా ఉందని వారన్నారు. ‘బ్యాడ్ బాయ్’ కరోనా కారణంగా డిలే అయింది. త్వరలోనే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి జనం ముందుకు తెచ్చే ప్రయత్నాల్లో ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు.

‘డిస్కో డ్యాన్సర్’ హంగామా : కొడుకు డెబ్యూ మూవీలో తండ్రి స్టెప్పులు!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-