‘మిస్ట‌ర్ బీన్’ ఇక‌లేరు అంటూ అస‌త్య ప్రచారం!

1990’ల కాలంలో ‘మిస్టర్ బీన్’ క్యారెక్టర్​తో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్నాడు రోవాన్ ఎట్కిన్‌స‌న్. తాజాగా మిస్ట‌ర్ బీన్ అలియాస్ రోవాన్ ఎట్కిన్‌స‌న్ చ‌నిపోయాడంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేశారు. ఫేస్బుక్ ఫేక్ పేజ్‌లో మే 29న న‌టుడు రోవాన్ ఎట్కిన్‌స‌న్ చ‌నిపోయాడ‌ని పోస్ట్ పెట్టారు. ఇది నిజ‌మ‌ని తెలుసుకొని చాలా మంది షేర్ చేశారు. ఆ ఫేక్ అకౌంట్ కి చాలామంది ఫాలోయర్స్ ఉండటంతో అదే నిజమనుకున్నారు. కాగా అది త‌ప్పుడు వార్త అని తెలియ‌డంతో నెటిజ‌న్స్ బోగ‌స్‌ పేజ్ నిర్వాహ‌కుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో ఆ పేజీ నుంచి పోస్ట్ డిలీట్​ చేశారు. మిస్టర్ బీన్ క్షేమంగా ఉన్నాడ‌ని తెలుసుకున్న ఆయ‌న అభిమానులు సంతోషం వ్య‌క్తం చేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-