“మిషన్ ఇంపాజిబుల్ 7” షూటింగ్ ఆగిపోయింది…!?

యాక్షన్ థ్రిల్లర్ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న “మిషన్ ఇంపాజిబుల్ 7” సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న పారామౌంట్ పిక్చర్స్ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా టామ్ క్రూజ్ హీరోగా నటిస్తున్న “మిషన్ ఇంపాజిబుల్ 7” చిత్రం మూవీ షూటింగ్ సెట్లో కొంతమంది సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందట. దీంతో మేకర్స్ ఈ సినిమా షూటింగ్ ను తాత్కాలికంగా ఆపేశారట. “మేము కరోనాకు సంబంధించిన అన్ని భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరిస్తున్నాము. అయినప్పటికీ మూవీ సెట్లో కరోనా వైరస్ పాజిటివ్ గా వచ్చిన కారణంగా జూన్ 14 వరకు మిషన్: ఇంపాజిబుల్ 7 షూటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేసాము” అని పారామౌంట్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ చిత్రం 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది అని మేకర్స్ ప్రకటించారు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమవుతుందో లేదో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-