వేటకు వెళ్లి గల్లంతైన సిక్కోలు మత్స్యకారుల ఆచూకీ లభ్యం

చెన్నైలో వేటకు వెళ్లి గల్లంతైన సిక్కోలు మత్స్యకారుల ఆచూకీ లభ్యం అయ్యింది. మత్స్యకారులు సురక్షితంగా ఉండటంతో ఊపిరిపీల్చుకున్నారు కుటుంబసభ్యులు. రామయ్యపట్నం – చెన్నై మధ్యలో మత్స్యకారుల బోటును గుర్తించారు కోస్ట్ గార్డు. ఆ తర్వాత మత్స్యకారుల బోటును కొంతమేర వరకూ తీసుకొచ్చిన కోస్టుగార్డు బోటు… చెన్నైకు చెందిన ఎస్.కె.టి కంపెనీకి చెందిన మరో మత్స్యకార బోటుకు అనుసంధానం చేసారు. మత్స్యకారుల బోటును ఒడ్డుకు లాకొస్తుంది ఎస్.కె.టి కెంపెనీకి చెందిన ఫిషింగ్ బోటు. ఈ రాత్రికి వారు చెన్నైలోని కాశీమేడు హార్బర్ కు చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-