“మిస్ ఇండియా” ఖాతాలో అరుదైన రికార్డు

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం “మిస్ ఇండియా”. గత ఏడాది ఓటిటిలో విడుదలై ఫర్వాలేదన్పించుకుంది ఈ చిత్రం. కీర్తి సురేష్ కు 20వ చిత్రమైన “మిస్ ఇండియా” తాజాగా ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఆ హిందీ వెర్షన్ కు రెండు రోజుల్లోనే ఏకంగా 2.6 కోట్ల వ్యూస్, 7.2 లక్షల లైకులు, 21 వేల కామెంట్స్ వచ్చాయి. తెలుగులో మిశ్రమ సమీక్షలను అందుకున్న ఈ చిత్రం హిందీలో మాత్రం దుమ్మురేపుతోంది.

Read Also : సత్యదేవ్ “తిమ్మరుసు” రైట్స్ వారికే…!

ఈమధ్య తెలుగులో డిజాస్టర్లుగా నిలిచిన చిత్రాలు హిందీలో మాత్రం హిస్టరీని క్రియేట్ చేస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి. తెలుగు వాళ్లకు పెద్దగా నచ్చని కంటెంట్ నే హిందీ వాళ్ళు సూపరో సూపర్ అంటున్నారు. కాగా “మిస్ ఇండియా”కు నరేంద్ర నాథ్ దర్శకత్వం వహించాడు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ ఎస్ కొనేరు నిర్మించారు. ఇందులో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటించగా, డాని సాంచెజ్-లోపెజ్, సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీని, తమన్ సంగీతం సమకూర్చారు. 2020 నవంబర్ 4న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైంది. ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అయ్యింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-