‘మిస్సింగ్’ ఫేమ్ మిషా నారంగ్ కు మరో ఛాన్స్‌!

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా నటించిన ‘తెల్లవారితే గురువారం’ చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మిషా నారంగ్. తాజాగా విడుదలైన ‘మిస్సింగ్’ సినిమాలోనూ వన్ ఆఫ్‌ ద హీరోయిన్స్ గా నటించింది. ఈ సినిమాతో నటిగానూ మిషాకు చక్కని గుర్తింపు లభిస్తోంది. ఇదిలా ఉంటే ఆమె నటిస్తున్న మూడో తెలుగు సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం మొదలైంది. ఈసారి మిషా… సీనియర్ నటుడు సాయికుమార్ తనయుడు ఆది సరసన చోటు దక్కించుకుంది.

ఆది హీరోగా శివశంకర్ దేవ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ అజయ్ శ్రీనివాస్ ఓ క్రైమ్ మిస్టరీ థ్రిలర్ ను విజయ దశమి రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. తాజాగా ఈ చిత్రంలో మిషాను నాయికగా ఎంపిక చేశారు. సోమవారం మూవీ రెగ్యులర్ షూటింగ్ నూ ప్రారంభించారు. హైదరాబాద్ కోకాపేట లోని ఒక ప్రైవేట్ హౌస్ లో ఆది సాయికుమార్, మిషా నారంగ్, భూపాల్ పై కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించాడు. కొత్త కాన్సెప్ట్, సరికొత్త కథనంతో సాగే ఈ సినిమాలో ఆది సాయికుమార్ గతంలో ఎప్పుడూ చేయని పాత్ర చేయబోతున్నారని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. అలీ రెజా, నందినీరాయ్, తాకర్ పొన్నప్ప, వాసంతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించే ఈ సినిమాకు అనీష్ సోలోమాన్ సంగీతం అందిస్తున్నారు.

Related Articles

Latest Articles