కూతురిపై ఆకతాయిల అఘాయిత్యం.. అడ్డుకున్న తల్లిని కూడా వదలకుండా

రోజురోజుకు మహళలపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. నడిరోడ్డుపై మహిళలు తిరగడమే పాపమైపోయింది. కఠిన చర్యలు లేక ఆకతాయిల ఆగడాలకు అడ్డు లేకుండా పోతుంది. తాజాగా కొందరు ఆకతాయిలు చేసిన పనికి ఒక మహిళ ప్రాణం పోయింది. కూతురిని ఏడిపించిన యువకులను ఆ తల్లి అడ్డుకుంది.. అదే ఆమె పాలిట యమపాశమైంది. తమనే అడ్డుకుంటావా అంటూ ఆ యువకులు ఆమెను అతి దారుణంగా హత్య చేసిన ఘటన చండీగఢ్‌ నడిరోడ్డుపై జరిగింది.

వివరాలలోకి వెళితే.. చండీగఢ్‌ ప్రాంతానికి చెందిన నిమ్రా కౌర్(35) తాం కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఆమెకు పమ్మీ అనే 16 ఏళ్ల కూతురు ఉంది. ఇద్దరు కలిసి రోజు దానా మండీ లో కూలీపనులకు వెళ్తుంటారు. ఎప్పటిలానే శనివారం కూడా ఇద్దరు పనికి వెళ్తుండగా.. కొందరు ఆకతాయిలు పమ్మీని ఏడిపించారు. అసభ్యంగా తాకుతూ లైగింక వేధింపులకు గురిచేశారు. దీంతో కూతురిని కాపాడేందుకు తల్లి వారిపై చేయి చేసుకొంది.. వారిని తరిమి తరిమి కొట్టింది. ఇక ఈ ఘటనను మనుసులో పెట్టుకున్న యువకులు నిమ్రాపై కక్ష కట్టారు.

ఆదివారం బోలేరా వాహనంలో వచ్చిన యువకులు పమ్మీని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. అడ్డుకోవడానికి వచ్చిన నిమ్రాను అతిదారుణంగా తమ వాహనంతో తొక్కించేశారు. దీంతో ఆమెన్ అక్కడిక్కడే మృతిచెందింది. దీంతో వారు అక్కడినుంచి పరారయ్యారు. ఈ దృశ్యమంతా సమీపంలోని సీసీటీవిలో రికార్డ్ అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవి ఫుటేజ్ ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉందని, నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Related Articles

Latest Articles