మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. చనిపోయినా వదలకుండా ప్రైవేట్ భాగాలను

రోజురోజుకు ఆడవారిపై మగవారి అకృత్యాలు ఎక్కువైపోతున్నాయి. కామంతో కళ్ళుమూసుకుపోయి.. ఎలాంటి దారుణాలకైనా ఒడిగడుతున్నారు. వావివరుసలు, చిన్నాపెద్ద మరిచి కామాంధులుగా మారుతున్నారు. తాజాగా ఒక మైనర్ బాలికను సమాజం సిగ్గుతో తలదించుకునేలా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు వ్యక్తులు. బాలిక మృతిచెందాకా కూడా వారి కామ దాహం తీరలేద. శవంపైన కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రైవేట్ భాగాలను ఛిద్రం చేశారు. వింటుంటేనే రక్తం మరిగిపోతుంది కదా.. అలాంటివారిని ఊరి తీయాలని, వారి తరుపున ఏ న్యాయవాది కూడా వాదించేది లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని బుండీకి చెందిన 16 ఏళ్ల మైనర్‌ బాలిక గత నెల 23 న మేకలు మేపడానికి అడవికి వెళ్లి అదృశ్యమైంది. దీంతో బాలిక మిస్సింగ్ కేసు గా నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఇటీవల బాలిక బుండీకి సమీపంలోని అడవుల్లో శవమై కనిపించింది. ఇక ఈ కేసును హత్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించగా నమ్మలేని నిజాలు బయటపడ్డాయి.

బాలికపై సాముహిక అత్యాచారం జరిగిందని, అతి కిరాతకంగా ఆమెను చంపి, ఆపై కూడా కామాంధులు వదలలేదని తేలింది. అంతేకాకుండా ఆమె ప్రైవేట్ భాగాలలో 30 వరకు గాయాలు ఉన్నాయని, బాలిక ఎంతో నరకాన్ని అనుభవించి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ ఘటనపై బుండీ పోలీసులు మాట్లాడుతూ” మా జీవితాలలో ఇలాంటి ఒక ఘటనను చూడలేదు.. బాలిక ఎంతటి నరక యాతన అనుభవించిందో అర్ధం చేసుకోగలరు.. ఆ ముగ్గురు నిందితులను ఉరి తీయాలి” అని తెలిపారు.. లాయర్లు కూడా ఈ ఘటనపై స్పందిస్తూ నిందితులకు సపోర్ట్ గా ఏ ఒక్కరు వాదించబోయేది లేదని తెలిపారు.

Related Articles

Latest Articles