గర్భం దాల్చిన బాలిక ఘటనపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు

జగిత్యాల జిల్లాల రాయికల్ లో గర్భం దాల్చిన బాలిక ఘటన చోటు చేసుకుంది. దీని పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైనట్లు తెలిపారు రాయికల్ పోలీసులు. ఐదు రోజులుగా ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు శిశు సంక్షేమ శాఖ అధికారులు, బాలల సంక్షేమ సమితి అధికారులు విచారణ జరిపారు. ఈనెల 25న బాలిక ఇంటికి వెళ్లగా ఇంట్లో లేక పోవడంతో జగిత్యాలలోని ఓ ఆస్పత్రిలో బాలికకు చికిత్స నిమిత్తం తీసుకెళ్లారనే విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లి విచారణ చేసారు. రాయికల్ లోని ఓ నాయకుడి ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న సమయంలో 25 ఏళ్ల యువకుడు తనను ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేశాడని, కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగా లేకపోవడంతో గర్భం దాల్చినట్లు తల్లిదండ్రులకు తెలిపింది బాలిక. ఈవిషయంపై పూర్తి విచారణ చేసి బాలికకు న్యాయం చేయాలని బాలల సంరక్షణ అధికారి హరీశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైం నంబరు 131/2021 ఫోక్స్ యాక్ట్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న పోలీసులు ఇప్పటికే నిందితుడికి అదుపులోకి తీసుకున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-