బీసీ కులాల వారీ జనగణన జరగడం లేదు: మంత్రి వేణుగోపాల్‌


రాష్ర్టంలో బీసీ కులాల వారీగా జనగణన జగరడం లేదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడి యాతో మాట్లాడారు. బీసీ కులాల వారిగా జనగణన జరకపోవడం వల్ల ఆయా వర్గాల వారి సంఖ్య ఎంతో, వారికి లభిస్తునన ప్రాతినిధ్యం ఎంతో తెలియడం లేదన్నారు. బీసీ కులాల జనగణన జరిగితే ఈ వర్గాలకు మరింత మేలు చేయటానికి అవకాశం ఉంటుంది. అంతే కాకుండా చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం ఉంటుం ది.జనగణన పట్టికలో బీసీలకు సంబంధించి ప్రత్యేకమైన కాలమ్ పెట్టాలన్నది మా డిమాండ్ అన్నారు.

శాసనసభలో పెట్టిన బిల్లులను అడ్డుకోవడానికిఏ శాసనమండలి అనే వాతావరణం అప్పుడు ఉందని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని మంత్రి అన్నారు. ఈ తీర్మానం పెట్టి 22 నెలలు అయిపోయింది… ఎటువంటి ముందడుగు పడలేదు అందుకే పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నాం. దీనిపై అందరి అభిప్రాయాలు తీసుకుం టామని ఈ సారి ఇది వీగిపోకుండా ఉండేలా అందర్ని కలుపుకుని పోతామని మంత్రి తెలిపారు. ఇప్పటికే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ సారైనా ప్రతిపక్ష సభ్యులు మండలిలో సహకరించాలని మంత్రి వేణు గోపాల్‌ కోరారు.

Related Articles

Latest Articles