పవన్ కంటే సన్నాసి ఎవరూ లేరు : వెల్లంపల్లి

జనసేన పవన్‌ కళ్యాణ్‌ కు మంత్రి వెల్లంపల్లి కౌంటర్‌ ఇచ్చారు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ డైలాగులు చెప్పే వ్యక్తి పావలా పవన్ కళ్యాణ్ అని… విజయవాడ కార్పొరేషన్ లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయాడని చురకలు అంటించారు. పవన్ కంటే సన్నాసి ఈ రాష్ట్రంలో ఎవరూ లేరని ఫైర్‌ అయ్యారు. రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట గెలవలేక పోయాడని… టికెట్లు ప్రభుత్వం అమ్మితే తప్పేంటి ? అని ప్రశ్నించారు.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో చోటు లేదని తెలిసి పవన్ మాటల్లో నిస్పృహ చెందుతున్నాడని.. బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముకుని బతికాలనుకునే నీచపు వ్యక్తి అని నిప్పులు చెరిగారు. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఎందుకు తగ్గించుకోవాలని పేర్కొన్నారు. చిరంజీవి లేకపోతే పవన్ జీరో అని… ప్రకాశ్ రాజ్ నటనలో 25 శాతం కూడా నటించటం చేతకాదని ఎద్దేవా చేశారు వెల్లంపల్లి. ఫామ్ హౌస్ లో కూర్చుని పేకాట ఆడటం తప్ప దేనికీ పనికి రాని వ్యక్తి పవన్ కల్యాణ్ అని మండిపడ్డారు. ముఖ్యమంత్రిని, మంత్రులను నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు వెల్లంపల్లి.

-Advertisement-పవన్ కంటే సన్నాసి ఎవరూ లేరు : వెల్లంపల్లి

Related Articles

Latest Articles