బ్ర‌హ్మంగారి మ‌ఠం పీఠాధిప‌త వ్య‌వ‌హారం.. రంగంలోకి మంత్రి

బ్రహ్మంగారి మ‌ఠం పీఠాధిప‌తి వ్య‌వ‌హారం తీవ్ర వివాదంగా మారిపోయింది.. దీంతో.. రంగంలోకి దిగుతున్నారు మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌.. ఇవాళ బ్రహ్మంగారి మఠానికి వెళ్ల‌నున్నారు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి.. పీఠాధిపతి వ్యవహారం వివాదానికి దారి తీసిన నేపథ్యంలో మంత్రి ప‌ర్య‌ట‌న‌ ప్రాధాన్య‌త సంత‌రించుకుంది… పీఠాధిపతి ఎంపిక విషయంపై స్వయంగా రంగంలోకి దిగుతున్న మంత్రి.. బ్రహ్మంగారి వారసులతో చ‌ర్చించ‌నున్నారు.. కుటుంబ సభ్యులతో విడివిడిగా చ‌ర్చించి ఓ నిర్ణ‌యానికి వ‌చ్చే అవ‌కాశం ఉంది.. స్థానిక ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో కలిసి పీఠాధిపతి వ్యవహారంపై చర్చించే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది.. ఇక‌, బ్రహ్మంగారి మఠం ఆలయ ఉద్యోగుల అవినీతిపై వచ్చిన ఆరోపణలను సైతం మంత్రి ఆరా తీస్తార‌ని స‌మాచారం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-