రాష్ట్రంలో శవ రాజకీయాలు చేసేది చంద్రబాబు: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మరోసారి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు పై తీవ్రంగా విమర్శలు చేశారు. రాష్ట్రంలో శవరాజకీయాలు చేసేది చంద్రబాబే నని అది అందరికి తెలుసని చెప్పారు. హత్యారాజకీయాలు, కుట్రలు చేసే అలవాటు చంద్రబాబుకే ఉందన్నారు. నరకాసురుడు, బకాసురుడు చంద్రబాబే అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు రాక్షస ఆలోచనలు భోగి మంట్లలో తగలబడాలని కోరుకుంటున్నా అంటూ మంత్రి వెల్లంపల్లి చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు.

Read Also: రేషన్ కార్డు దారులకు గుడ్‌ న్యూస్‌ .. ఐదు రోజులు గడువు పెంపు

నీచ, దరిద్ర, హత్య, కుట్ర రాజకీయాలు చేయడాన్ని చంద్రబాబు మానుకోవాలన్నారు. చంద్రబాబు మానుకోకపోతే ఇదే భోగి మంటల్లో కార్చిచ్చు అవుతారని హెచ్చరించారు. పల్నాడులో హత్యపై పూర్తిగా దర్యాప్తు జరుగుతుందని కానీ చంద్రబాబు దీన్ని రాద్ధాంతం చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.ఈ హత్యకు వైసీపీకి ఎలాంటి సంబధం లేదన్నారు. ఇలాంటివి ప్రొత్సహించే సంస్కృతి వైసీపీకి లేదని, టీడీపీకే ఉందని మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

Latest Articles