నారా లోకేష్ పై మంత్రి తానేటి వనిత ఫైర్…

నారా లోకేష్ పై స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఫైర్ అయ్యారు. తాజాగా ఎన్టీవీ తో మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ… లోకేష్ ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నాడు..రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాడు. ప్రభుత్వం స్పందించకపోతే పరామర్శ కి వెళ్ళాలి గాని స్పందించిన తరువాత కూడా పరామర్శ దేనికి. ఘటన జరిగిన ఎన్నో నెలలకి పరామర్శ ఏంటి అని ప్రశ్నించారు. దిశా చట్టం తీసుకు రావాలని సీఎం ని ఎవరు అడగలేదు. ఆడ బిడ్డల రక్షణ కోసం సీఎం దిశా చట్టం తీసుకు వచ్చారు. దిశా చట్టం కి కేంద్రo నుండి అనుమతి రాలేదు కాబట్టి దిశా యాప్ ద్వారా ఆడబిడ్డలకు ప్రస్తుతం రక్షణ ఇస్తున్నాం అన్నారు.

ఇక ముఖ్యమంత్రి మీద భయం తో ప్రతిపక్ష నేతలు పరుగులు పెడుతున్నారు. ఆడబిడ్డలకు మీద శ్రద్ద, అభిమానం ,ప్రేమ టీడీపీ నేతలకు లేదు. కేంద్రం వద్ద దిశా చట్టం ఇంప్లిమెంట్ అవకుండా కొర్రీలు వేస్తుంది టీడీపీనే. కొర్రీలు వేసేది వీళ్ళే, అడబిడ్డల మీద ప్రేమ ఉందని డ్రామాలు ఆడేది వీళ్ళే. దిశా చట్టం ఆమోదం పొందితే క్రైం రేట్ తగ్గుతుంది. రాష్ట్రంలో సైకోలు లేకుండా చేయాలి అంటే కేంద్రం నుండి దిశా చట్టం ఆమోదం పొందాల్సిందే అని పేర్కొన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-