ఈటల గెలిస్తే ఏం న్యాయం జరుగుతుంది : తలసాని

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంట గుండ్ల చెరువులో చేప పిల్లలు వేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అనంతరం ఆయన మాట్లాడుతూ… నేను రాజీనామా చేసినందుకు చేప పిల్లలు వస్తున్నాయని ఈటల చెబుతుండు. చేప పిల్లల పంపిణి కార్యక్రమం ప్రభుత్వం ఏమైన కొత్తగా చేపట్టిందా… స్వయం పాలన రావడం ఎంత ముఖ్యమో మనకు ఇప్పుడు అర్ధం అవుతుంది. తెలంగాణలో కుల వృత్తుల మీద ఆధార పడి జీవన ప్రమాణాలు ఉంటాయి. కుల వృత్తులను అన్ని విధాలుగా ఆదుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్. చేప పిల్లలను ఉచితంగా పంపిణి చేయాలని కేసీఆర్ కు ఎవరు చెప్పలేదు. 90కోట్ల చేప పిల్లల సీడ్, 25కోట్ల రొయ్యల సీడ్ పంపిణి చేస్తున్నాం అన్నారు.

ఇక 66వేల మందికి ద్వీ చక్ర వాహనాలు, టాటా ఏస్, డి సిఎమ్, టెంపో లు, జాలర్లు, జాకెట్లు అందించిన ఘనత టీఆరెఎస్ దే. నీటి మీద పూర్తి హక్కులు మత్స్యకారులకు ఉండాలని కేసీఆర్ జీవో తెచ్చారు. వారికి మార్కెటింగ్ స్పెషాలిటీ కల్పించడం కోసం కృషి చేస్తున్నాం. ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఎక్స్ పోర్ట్ చేసేందుకు కృషి చేస్తాం. బిజేపి వాళ్ళు ఒక్క ప్రాజెక్ట్ అయిన తీసుకు వచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. బండి సంజయ్ ఒక్క లక్ష రూపాయాలు తీసుకు వచ్చిన చరిత్ర లేదు. వర్షాలు కొట్టి వరుధలు వస్తె ఎక్కడ పోయారు. మంచి ప్రాజెక్ట్ తెచ్చి ప్రజల మెప్పు పొందాలి. ఇష్టం ఉన్నట్లు కేసీఆర్ ను తిట్టడం తప్ప వారికి ఏం తెలియదు. దళిత బందు తీసుకు వస్తే ఎల్లిగానికి, మల్లిగానికి ఇవ్వాలని మాట్లాడుతుర్రు. ఎవరికి ఇవ్వాలో కేసీఆర్ కు తెలియదా. రైతు బంధు రూ.10లక్షలు వస్తె ఈటల రాజేందర్ ఎందుకు తీసుకున్నడు. ఆ రోజు ఇదే ఈటెల ఆహా ఓహొ ఆహా అని మాట్లాడిండు. ఇప్పుడు నేను రాజీనామా చేస్తే వస్తున్నాయి అని అంటుండు. ఈటల గెలిస్తే మనకు ఏం న్యాయం జరుగుతుంది. ఈటల ధనవంతుడు. ఎట్లాగైన బ్రతుకుతాడు. ఈటల చేతగాని తనంతో నే అధికారంలో ఉండి అభివృద్ది చేయలేదు అని అన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-