నిమజ్జనంపై సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తాం : తలసాని

గణేష్ నిమజ్జంపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటాము అని మంత్రి తలసాని అన్నారు. ట్యాంక్ బండ్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయడానికి హైకోర్టు నిరాకరించింది. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం అని తలసాని తెలిపారు. మరొక రోజులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సైతం చేస్తున్నాం. ట్యాంక్ బండ్ సహా గ్రేటర్ పరిధిలో అనేక లేక్స్ లో నిమజ్జనం ఏర్పాట్లు చేశాం. హుస్సేన్ సాగర్ లో ఖచ్చితంగా నిమజ్జనం చేస్తామనటం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అభిప్రాయం. వాళ్ళ అభిప్రాయంపై ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. గణేష్ చతుర్థికి దేశంలోనే హైదరాబాద్ ది ప్రత్యేక స్దానం‌. అందుకు తగిన ఏర్పాట్లు తెలంగాణ ప్రభుత్వం చేసింది అని పేర్కొన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-