కేసీఆర్‌ జైలుకు వెళ్తే దేశమే భగ్గుమంటుంది: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

కేసీఆర్‌కు జైలుకు వెళ్తే దేశమే భగ్గుమంటుందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీని తీవ్ర స్తాయిలో విమర్శించారు. మా విధానాలు దేశానికి ఆదర్శం ఎందరో ఇతర రాష్ట్రాల ప్రతనిధులు మా విధానాలపై పరిశీలనకు వచ్చారు. ఐక్యరాజ్యసమితి లాంటి పెద్ద సంస్థలు కూడా తెలంగాణ అభివృద్ధి విధానాలు భేష్‌ అని కితాబిచ్చాయన్నారు. మీరు అధికారంలో లేనంత మాత్రానా మంచిగా పరిపాలనా చేసే వారిపై నిందలు వేయొద్దని, కేసీఆర్‌కు ఏమైనా అయితే మొత్తం దేశమే ఏకమైతుందని, తెలంగాణ పోరాటంలో ప్రాణాలను సైతం లెక్కచేయని మనిషి దేనికిభయపడతారంటూ బీజేపీకి చురకలు అంటించారు. ఆధ్యాత్మిక రంగాన్ని కూడా కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని కానీ ఎప్పుడు దాన్ని రాజకీయంగా వాడుకోలేదన్నారు. గ్రౌండ్ వాటర్‌ను పెంచి వ్యవసాయానికి ఉపయోగపడేలా చేశామన్నారు. కాళేశ్వరాన్ని ప్రపంచానికి పరిచయం చేశాం. ఇక్కడ మీరు అధికారంలోలేరని మంచిగా పరిపాలించే వారిని ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారంటూ ఫైర్‌ అయ్యారు.

Read Also: పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలి: మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

తెలంగాణ అభివృద్ధి చెందుతుందని మీరు ఇచ్చిన అభివృద్ధి రిపోర్టులనే మీరు తుంగలో తొక్కి కేసీఆర్‌ ను విమర్శించడం సరికాదన్నారు. ఎరువుల ధరలు తగ్గించాలని అడిగితే మాపై విమర్శలు, జైళ్లు అంటూ బీజేపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని కేసీఆర్‌ జైల్లో పెడతారా పెట్టి చూడండి అంటూ సవాల్‌ విసిరారు. పచ్చని పంటలో మంచి ఎరువు చల్లాలి కానీ విషన్ని చల్లేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. మాకు ప్రజలను దృష్టిలో పెట్టుకుని పరిపాలన సాగించడం ఒక్కటే తెలుసు.. తెలంగాణకు మీరు సాయం చేయకపోయినా ఫర్వాలేదు. తెలంగాణను ఇబ్బంది పెట్టే పనులు చేయవద్దని శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. కేంద్రం రెండు కోట్ల ఉద్యోగాలు, బ్యాంకు అకౌంట్లో 15లక్షలు వేస్తామన్నారు. అవన్నీ ఏమయ్యాయి…? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. తెలంగాణలో రైతుల ఆదాయన్ని రెట్టింపు చేస్తున్న మాపై విమర్శలకు దిగడం సరికాదు. ఏ సమస్యలు ఉన్నా దేశానికి పెద్ద దిక్కు ప్రధాని కాబట్టి ఖచ్చితంగా ప్రధానికే లేఖ రాస్తాం దాంట్లో తప్పేముందన్నారు. రాజకీయంగా ఏదైనా మాట్లాడొచ్చు కానీ, అనవసరంగా విమర్శలకు దిగితే ఎవ్వరూ చూస్తు ఊరుకోరని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హెచ్చరించారు.

Related Articles

Latest Articles