తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్…

మంత్రి సత్యవతి రాథోడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ… క్రిష్ణా జలాలో తెలంగాణ వాటా గురించి కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళాం. కేంద్రం సకాలంలో స్పందించకపోవడంతో….ఈ అంశం కోర్టుకి వెళ్లింది. మిగులు జలాలను వినియోగించుకోవాలని ఏపీ సీఎం దృష్టికి తీసుకువచ్చినా స్పందించలేదు అన్నారు. తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలిగితే దేవుడితో అయిన పోరాటం చేస్తారు కేసిఆర్ అని చెప్పిన మంత్రి హుజురాబాద్ లో టీఆర్ఎస్ గెలుపు తథ్యం అన్నారు. ఇక ఇదిలా ఉంటె ఈరోజు తిరుమల శ్రీవారిని 18,462 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 10,203 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా హుండీ ఆదాయం 1.51 కోట్లు ఉంది.

Related Articles

Latest Articles