ఆత్మ గౌరవం కోసం కాదు… ఆత్మ రక్షణ కోస‌మే ఈట‌ల రాజీనామా..!

ఈటల రాజేంద‌ర్ విమ‌ర్శ‌లు చేసినా, ఆరోప‌ణ‌లు గుప్పిస్తూ వ‌చ్చినా.. ఇంత కాలం కాస్త ఓపిక ప‌ట్టిన టీఆర్ఎస్ నేత‌లు.. ఇప్పుడు ఈట‌ల‌.. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయ‌డంతో ఒక్క‌సారిగా ఆయ‌న‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.. ఈట‌ల ఎపిసోడ్‌పై స్పందించిన మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్.. ఆత్మ గౌరవం కోసం కాదు… ఆత్మ రక్షణ కోస‌మే టీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజీనామా చేశార‌ని ఆరోపించారు.. స్వప్రయోజ‌నాల కోసం తెలంగాణ ప్రయోజనాలకు అడ్డు పడే బీజేపీ కాళ్ల వ‌ద్ద ఆత్మగౌరవాన్ని ఈటెల తాక‌ట్టుపెట్టార‌ని మండిప‌డ్డ ఆమె.. సీఎం కేసీఆర్ పై ఈటల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

ఈటల రాజేందర్ రాజీనామ చేస్తూ.. పార్టీకి ఎంతో సేవ చేశారని చెప్పారు. కానీ, ఈటల.. పార్టీకి చేసిన సేవకంటే సీఎం కేసీఆర్ ఎక్కువ‌గా పదవులు, బాధ్యతలు ఇచ్చార‌ని తెలిపారు మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్.. కానీ, ఆత్మ గౌరవంతో ఉండే వారికి అవమానం జరిగింది అంటున్నార‌ని.. పార్టీకి, ప్రజలకు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటే తొలగించార‌న్నారు.. సీఎం కేసీఆర్ పై ఈటల మాటలు ఖండిస్తున్నాం.. ఐదేళ్లుగా అవమానం జరుగుతుంది అన్నారు. మరి 5 ఏళ్లుగా ఆత్మగౌరవం కోసం పాటుపడక ఈరోజు వరకు ఎందుకు ఉన్నారు? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. మీరు స్థాయికి రావడానికి గొప్ప అవకాశం కల్పించింది సీఎం కేసిఆర్ కాదా? అని ప్ర‌శ్నించిన ఆమె.. ఆత్మ గౌరవం కోసం కాదు ఆత్మ రక్షణ కోసం పార్టీ వీడుతున్నార‌ని మండిప‌డ్డారు.. తనకున్న అధికారం, గౌరవం ద్వారా ఆ ప్రాంతానికి మేలు చేయాలి. ఇది నాయకుని లక్ష్యం.. కానీ, మీరు పేదవాళ్లు భూములు తీసుకున్నార‌ని ఆరోపించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-