అందుకే వరంగల్ కు ఎక్కువ ఎమ్మెల్సీ స్థానాలు : సత్యవతి రాథోడ్

స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ అనంతరం మీడియాతో ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… అన్ని ఎమ్మెల్సీ స్థానాల గెలుపు నల్లేరు మీద నడకే. ఎంపీటీసీల గౌరవ వేతనం పెంచాం, ఇంకా పెంచుతాం. ఎంపీటీసీలకు నిధులు కేటాయిస్తాం అన్నారు. ఇక తమను రెచ్చగొట్టే నేతలకు ఎంపీటీసీలు సరైన సమాధానం చెప్పాలి. ఏకగ్రీవం అయ్యేలా అందరూ కృషి చేయాలి అని తెలిపారు.

ఆ తర్వాత మంత్రి సత్యవతి రాథోడ్ మట్కాడుతూ… వరంగల్ జిల్లా అంటే కేసీఆర్ కు అభిమానం. అందుకే ఎక్కువ ఎమ్మెల్సీ స్థానాలు వరంగల్ కు ఇచ్చారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసిన రాష్ట్రం తెలంగాణ. అందుకే పోచంపల్లిని ఏకగ్రీవంగా ఎన్నకోవాలి అని సూచించారు.

Related Articles

Latest Articles